ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామపంచాయతీలో మంగళవారం “బాల్య వివాహ ముక్త్ భారత్” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేష్ పాల్గొని మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కృషి చేయాలని, బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరపాలని సూచించారు. పిల్లల రక్షణ, విద్య,ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.