ATP: ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణాల పూర్తికి రూ.6.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషితో ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తూ జీవో 452 విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.