అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటిలతో క్రేజీ మల్టీస్టారర్‌ను దర్శకుడు చందు మొండేటి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఉజ్జయిని నేపథ్యంగా సాగే ఈ కథపై ఇప్పటికే ఇద్దరు హీరోలు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీని నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నాడట. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్.