SDPT: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ బీఎంఎస్ (BMS) రాష్ట్ర అధ్యక్షులు కలాల్ బుధవారం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్మికుల న్యాయపోరాటానికి బీఎంఎస్ సంపూర్ణ సంఘీభావం తెలుపుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.