TG: ఆర్టీసీ సిబ్బంది ఎవరూ సమ్మెకు వెళ్లవద్దని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే కమిటీ వేశామని, లేబర్ జాయింట్ కమిషనర్ వద్ద చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చలు ముగియక ముందే సమ్మె చేయడం సరికాదని, చట్టవిరుద్ధంగా సమ్మెకు వెళ్తే జీతంలో కోతతో పాటు కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.