యాదగిరిగుట్ట డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మెకు విస్తృత మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గం సభ్యులు నాయకులు పాల్గొన్నారు.