TG: బక్రీద్ వేళ గొర్రెలు, మేకల అమ్మకందారులు జాగ్రత్తగా ఉండాలని CP సజ్జనార్ సూచించారు. డిజిటల్ చెల్లింపుల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఫేక్ ఫోన్‌పే యాప్ ద్వారా స్క్రీన్ చూపించి మోసాలు చేస్తున్నారని హెచ్చరించారు. ఖాతాలను చెక్ చేసుకోని వ్యాపారులను చూసి మోసం చేస్తున్నారని చెప్పారు. స్క్రీన్ షాట్లు, పేమెంట్ సక్సెస్ మెసేజ్‌లు చూసి నమ్మవద్దన్నారు.