NGKL: తాడూర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్సై గురుస్వామి జిల్లా వీఆర్ విభాగానికి బదిలీ కాగా, మరికల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాములు తాడూరు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి ఘన స్వాగతం పలికారు.