MHBD: వెంకటాపురంలో ఇటీవల మృతి చెందిన నర్సింగోజు రుక్మిణమ్మ, శీలం సోమయ్య, దొంతు సత్యం కుటుంబాలను మండల కాంగ్రెస్ నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాలతో ప్రతి కుటుంబానికి రూ. 3 వేల చొప్పున మొత్తం రూ.9 వేల నగదు, 75 కేజీల బియ్యాన్ని అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.