RR: నందిగామ మండల కేంద్రంలో విద్యుత్ షాక్కు గురై జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రైతు జిల్లెల్ల బాల్ రెడ్డి వ్యవసాయ పొలంలో ఈ ఘటన జరిగింది. బాల్ రెడ్డి సమాచారంతో స్పందించిన శంషాబాద్ రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతి చెందిన నెమలిని స్వాధీనం చేసుకున్నారు.