PLD: చిలకలూరిపేట మార్కెట్ ఏరియాలోని మటన్, చికెన్ షాపులను మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. చికెన్ షాపు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈగలు, కీటకాలు రాకుండా గ్లాస్ అద్దాలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల మేరకు శుభ్రత పాటించే వరకు షాపు మూసివేయాలని ఆదేశించారు.