KRNL: పెద్దకడబూరు గ్రామంలోని సర్వే నంబర్ 262/A3లో ఉన్న 3.38 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలు జరుగుతున్నాయని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యదర్శి బొగ్గుల తిక్కన్న కార్తికేయ ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆయన, 33 మంది ఆక్రమణదారులను గుర్తించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు వెంటనే నిలిపివేయాలని కోరారు.