AP: స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పన్నుల వసూళ్ల పక్రియను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పన్నుల చెల్లింపుపై అధికారులు, ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, వ్యర్థాల నివారణకు ఏర్పాటు చేసిన స్వచ్ఛరథం వాహనాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.