MHBD: కొత్తగూడ మండలంలో బుధవారం (రేపు) నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. కొత్తగూడ, ఓటాయి క్లస్టర్లలో మొత్తం 11 గ్రామపంచాయతీలకు సంబంధించిన ప్రజా సమస్యలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరవుతారని కలెక్టర్ పేర్కొన్నారు.