GNTR: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాడ్ డై క్లోరైడ్ 24% ఎస్ఎల్ అమ్మకాలను నిషేధించిందని తెనాలి మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు తెలిపారు. ప్రజలకు హానికారకమైన దీనిని ఎవరైనా అమ్మకాలు జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారాక్వాడ్ కారణంగా ఆత్మహత్యా మరణాలు పెరుగుతున్నందున నిషేధం విధించినట్లు ఏవో సుధీర్ బాబు చెప్పారు.