అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని ఖవ్డాలో 3.37 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీంతో దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. ఈ ప్రాజెక్టును కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయడం విశేషం.