MLG: హైదరాబాద్ బంజారాహిల్స్లో “సఖి నివాస్”, “సఖి కేంద్రం”లను మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు సురక్షిత వసతి కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 150 మంది మహిళలకు వసతి కల్పించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాలకు రుణాలు, ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.