MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ వసుమతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన చేపట్టి, జరిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎస్సై యాదగిరి, ఏఎస్ఐ వాణి, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.