అన్నమయ్య: రాయచోటి రూరల్ మండలం మాధవరం పంచాయతీలోని YSR రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) కార్యాలయ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాజకీయ కక్షలతో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పగలగొట్టారా? లేక స్థానిక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.