సంగారెడ్డిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం అర్హులైన ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.విద్యార్థులు జూన్ 5వ తేదీలోగా చేసుకోవాలన్నారు.