KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని మంగళవారం చతిస్గడ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా కుటుంబ సమేతంగా కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు దేవస్థానం ఈఓ చక్రదర్ రావు అలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయగా ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.