MHBD: నర్సింహులపేట మండలంలోని కౌసల్యాదేవిపల్లి గ్రామంలో బుధవారం బొడ్రాయి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవతలను దర్శించుకుని ఆయన పూజలు నిర్వహించారు. దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.