శ్రీకాకుళం, గార మండలాలకు చెందిన 91 మంది వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే శంకర్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘాల రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో మహిళలను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడమే లక్ష్యం అని పేర్కొన్నారు.