పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూడాన్ దేశానికి ఆయుధాలు, యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల భారీ రక్షణ ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియా చేసిన విజ్ఞప్తి మేరకు ఇస్లామాబాద్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.