TG: 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనే ఎవరికైనా వచ్చిందా? అని నిలదీశారు. ప్రజాపాలన పోవాలని.. పాపాల భైరవుడు రావాలని ఒక పెద్దమనిషి అంటున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో పండుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో.. పార్టీ మారుతున్న పెద్దమనిషి చెప్పాలన్నారు.