KMM: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వర్ణ సుబ్బారావు అన్నారు. ఓటీపీ పేరుతో షరతులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే ఆ నిబంధనలను రద్దు చేయాలని సోమవారం కలెక్టరేట్లో రైతులతో కలిసి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.