KMM: నెలవారీ చందా ఇవ్వలేదన్న కారణంతో తమను కుల బహిష్కరణకు గురిచేశారని మధిర మండలం ఆత్కూరు గ్రామ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ. 50 చందా కట్టలేదని తమ ఇళ్లకు ఎవరూ వెళ్లకూడదని, వెళ్తే రూ. 20 వేల జరిమానా విధిస్తామని గ్రామంలోని కొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు వారు ఫిర్యాదు చేశారు.