MBNR: టీజీఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీకి అండగా ఉంటుందన్నారు.