NLR: కోవూరు మండలం, వేగూరు పంచాయతీ వసంతపురం అంగన్వాడి కేంద్రంలో గురువారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నిర్మల మాట్లాడుతూ… ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయన్నారు. బయట దొరికే ఆహారాన్ని తినకుండా, ఇంటిలోనే ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నారు. తాజా ఆకుకూరలు పండ్లు తినాలని సూచించారు.