E.G: బిక్కవోలు మండలం కొమరిపాలెంలో పంచాయతీ కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గం కూటమి సమన్వయ కమిటీ సభ్యులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కూటమి నాయకులతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.