TG: BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మారేడ్‌పల్లిలోని క్రిశాంక్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.