TG: ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ సమావేశం కానుంది. ఉన్నతాధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఉదయం 10గంటలకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో సమావేశం కానున్నారు. కాగా, గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడంతో బస్సు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.