KMM: పాలేరు నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజా దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. రేపు నేలకొండపల్లి మండలం రాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలి కార్యక్రమం జరగనుంది. కలెక్టర్, అన్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండి విజ్ఞప్తులను పరిష్కరిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 12వరకు తొలి దర్భార్ జరుగుతుందని అధికారులు తెలిపారు.