TG: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని కార్మికులు ధ్వంసం చేశారు. మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి BRS పార్టీ నేతలు భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు.