VSP: కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగంలో వెంటిలేటర్, వార్మర్ పరికరాలను సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల వ్యయంతో ఇనార్బిట్ మాల్ సీఎస్ఆర్ ద్వారా అందించిన ఈ పరికరాలు శిశు అత్యవసర చికిత్సకు ఉపయోగపడనున్నాయని తెలిపారు. వెంటిలేటర్‌ను ఐఐటి ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.