HYD: ఆర్టీసీ బస్సుల బంద్ ప్రభావం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు నడవకపోవడంతో గురువారం ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్(ఓపీ) విభాగ కౌంటర్లలో జనాలు లేక వెలవెలబోయాయి. సాధారణ రోజుల్లో నిత్యం 3000 నుంచి 4000 మందికి పైగా రోగులు వచ్చే ఈ విభాగానికి, ప్రస్తుతం ప్రజా రవాణా సౌకర్యాలు లేక రోగుల తాకిడి గణనీయంగా తగ్గింది.