KKD: పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు. కొత్తపల్లి పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు గురువారం 10 మందిని పిఠాపురం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరికి జైలు శిక్ష విధించగా.. మరో ఎనిమిది మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు CI శ్రీనివాస్ తెలిపారు. నర్సింగపురం రోడ్డులో SI ఎస్ఎస్కే జానీబాషా ఈ తనిఖీలు చేపట్టారు