E.G: నిడదవోలు పట్టణంలో పాటిమీద గణేష్ టెంపుల్ వెనుక ఉన్న ప్రమాదకర స్థలంపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు స్పందించారు. టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు స్థలాన్ని పరిశీలించి యజమానికి నోటీసులు జారీ చేశారు. తక్షణ రక్షణ చర్యలు, కంచె ఏర్పాటు, హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఆదేశాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.