NLG: చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎండి గౌస్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా ఈ నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల పరమేష్, బొబ్బల రాం రెడ్డి, జిట్ట రవి తదితరులు పాల్గొన్నారు.