AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M) గుడిచర్ల, కొత్తూరు గ్రామాల్లో కలుషిత నీరు తాగి 25 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో బాధితులు PHCలో చికిత్స పొందుతున్నారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.