NZB: ధర్పల్లి విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 33వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ‘విశ్వకర్మ భగవాన్ కి జై’ అంటూ భక్తులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు టి. రమేష్, సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.