‘జన నాయగన్’ మూవీ లీక్ నేపథ్యంలో ‘సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్’ (SIFEA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్‌ను సస్పెండ్ చేసింది. ఓ ఫ్రీలాన్స్ ఎడిటర్ ఎడిటింగ్ రూమ్‌లోకి వెళ్లి, ఫుటేజీని చోరీ చేసినట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. ప్రదీప్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ SIFEA ఈ చర్యలు చేపట్టింది.