NTR: నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ నాయుడు, ఎస్సై మహతి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. వాహనదారులకు హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే వాహన పత్రాలు పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు.