JN: జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తుమ్మల రాజశేఖర్ ఉదయం మరణించారు. విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యక్రమాలలో అత్యంత చురుకుగా పాల్గొనే రాజశేఖర్ ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమని తెలిపారు.