CTR: బాల్య వివాహాల నిర్మూలన, భ్రూణ హత్యల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీవో చంద్రకళ పేర్కొన్నారు. నడుమూరులో శంకర్ కళాజాత బృందంతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల నిషేధం, సెల్ ఫోన్ వాడకం తగ్గించడంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపం తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.