కోనసీమ: మురమళ్ల వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం, కళా హోమాలు, స్వామివారికి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు, అమ్మవారిని నంది వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.