VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ భరత్ గుప్తా పరిశీలించారు. వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్‌తో కలిసి వేదిక పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అతిథుల ప్రోటోకాల్, విద్యార్థుల సౌకర్యాలు, పార్కింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.