BDK: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ (PACS) వ్యవసాయ కమిటీ కార్యాలయం ముందు గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.