SRD : గుమ్మడిదల టోల్ గేట్ వద్ద పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు, కొత్తపల్లి నుంచి అన్నారం వైపు వెళ్తున్న రెండు ట్రాలీ ఆటోల్లో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక వాహనంలో 72 బస్తాలు, మరొకదాంట్లో 46 బస్తాలు ఉన్నాయి. ఒక్కో బస్తా 50 కిలోల చొప్పున మొత్తం 5900 కిలోల బియ్యం సీజ్ చేశారు.