NLG: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కు అన్ని పార్టీలు బాధ్యత వహించాలని కోరారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు. కార్మికుల ఎవరు ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.